
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ఫుల్ బిజీ. కథానాయికగా అడుగుపెట్టి 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదుంది.

ఇప్పుడు ఈ బ్యూటీ నటించిన భోళా శంకర్, జైలర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆగస్ట్ 10,11 తేదీలలో ఈ రెండు సినిమాలు అడియన్స్ ముందుకు రానున్నాయి.

ఈ క్రమంలోనే తన చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది తమన్నా. వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ గడిపేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ పట్టుచీరలో అందంగా మెరిసిపోయింది. సంప్రదాయ లుక్ లో మంత్రముగ్దులను చేస్తుంది తమన్నా.

చురకత్తిలాంటి చూపులతో కవ్విస్తోన్న తమన్నా లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.