Rajeev Rayala |
Jul 14, 2022 | 9:19 AM
టాలీవుడ్ టు బాలీవుడ్ కు వెళ్లిన భామల్లో తాప్సీ పన్ను ఒకరు.
బాలీవుడ్ లో తాప్సి సెలక్ట్ చేసుకుంటున్నా సినిమాలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి
అక్కడ 'సూర్మా' 'సాంద్ కి ఆంఖ్' 'రష్మీ రాకెట్' ఇలా విభిన్నమైన స్పోర్ట్స్ తరహా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడు ఆమె నుంచి 'శభాష్ మిథు' అనే మరో స్పోర్ట్స్ సినిమా రానుంది.
మహిళా క్రికెట్ ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసినటువంటి మిథాలీ రాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.
భవిష్యత్తులో అవెంజర్స్ తరహాలో ఏదైనా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయాలని ఉన్నట్లు తాప్సీ తన మనసులోని మాటను బయటపెట్టింది.