
పాన్ ఇండియన్ సినిమా తీయడం కాదు.. దాన్ని సరైన సమయంలో విడుదల చేయడమే దర్శక నిర్మాతలకు తలనొప్పిగా మారిందిప్పుడు. ఈ సమస్య సూర్య సినిమాకు కూడా తప్పట్లేదిప్పుడు. బడ్జెట్ చూస్తేనేమో బారెడు.. రిలీజ్ డేట్స్ ఏమో కనబడవు..! దాంతో కంగువా నిర్మాతలు కంగారు పడుతున్నారిప్పుడు. ఇంతకీ వాళ్ల రిలీజ్ ప్లాన్ ఏంటి..?

సూర్య కెరీర్‌లోనే కాదు.. తమిళ ఇండస్ట్రీ చరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటి కంగువా. మూడేళ్లుగా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు దర్శకుడు శివ. ఆయన్ని నమ్మి సూర్య కూడా కంగువా ప్రపంచంలోకి వెళ్లిపోయారు.

ఒకటి రెండు కాదు.. 38 భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో కోలీవుడ్‌కు కలగా మిగిలిన పాన్ ఇండియన్ విజయాన్ని అందిస్తానంటున్నారు సూర్య. మరి ఈయన నమ్మకం నిజమవుతుందా లేదా అనేది నవంబర్ 14న తేలనుంది.

కానీ సడన్‌గా సీన్‌లోకి వేట్టయన్‌తో రజినీ వచ్చారు. దాంతో వినమ్రత చూపించి.. సూపర్ స్టార్‌కు సైడ్ ఇచ్చారు సూర్య. అదే ఇప్పుడు కంగువాను కంగారు పెడుతుంది. మరో డేట్ లేక టీంను తిప్పలు పెడుతుంది. కంగువా బిజినెస్ దాదాపు 400 కోట్ల వరకు జరుగుతుంది.

అయితే ఈ కామెంట్స్ మీద తమిళ మీడియాలోనూ విమర్శలు వినిపించాయి. ఇప్పటి వరకు వెయ్యి కోట్లు సినిమా కూడా లేని కోలీవుడ్‌లో రెండు వేల కోట్ల కలెక్షన్స్ అయ్యే పనేనా అన్న సెటైర్స్ సోషల్ మీడియాలో కనిపించాయి.