
జూలైన 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఆనంద్ అంబానీ రాధిక మర్చంట్ వివాహానికి సినీ తారలు జ్యోతిక, సూర్య హాజరైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కోలీవుడ్ సంప్రదాయ లుక్‌గా అద్భుతంగా కనిపించి అడియన్స్ హృదయాలను దొచేశారు.

ఐవరీ కలర్ షర్ట్, పంచెలో సూర్య, పింక్ గోల్డ్ కలర్ చీరలో జ్యోతిక మరింత అందంగా కనిపించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకకు ముందు తీసిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు జ్యోతిక.

చాలా కాలం తర్వాత సూర్య, జ్యోతిక ఇద్దరూ ఎంతో సంతోషంగా కలిసి కనిపించారు. చాలా కాలంగా వీరిద్దరి గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అంబానీ పెళ్లి వేడుకలలో సూర్య, జ్యోతిక ట్రెడిషనల్ వేర్ లో కనిపించి రూమర్లకు చెక్ పెట్టారు.

అంబానీ పెళ్లి వేడుకలలో కోలీవుడ్ తారలంతా తమిళ సంప్రదాయం ప్రకారమే హాజరయ్యారు. పంచె కట్టు, పట్టుచీరలో దంపతులు కలిసి హాజరవుతుంటారు. ఇక ఇటీవల జరిగిన అంబానీ వివాహ వేడుకలలో విఘ్నేష్ శివన్, నయనతార, సూర్య, జ్యోతిక, రజినీ, అట్లీ ఇలా అందరూ తమిళ సంప్రదాయంలోనే హాజరయ్యారు.

పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలాగే కొన్నిరోజుల క్రితం హిందీలో అక్షయ్ కుమార్ నటించిన మూవీలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం సూర్య కంగువ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సూర్య, జ్యోతిక దంపతులు ముంబైలో సెటిల్ అయ్యారు. తమ పిల్లల చదువుల కోసమే ముంబైలో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. కానీ సూర్య కుటుంబంతో ఏర్పడిన మనస్పర్థల కారణంగానే జ్యోతిక వేరుగా ఉంటుందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి.