అటు కామెడీ షోలు ఈవెంట్స్... మరోవైపు సినిమాల్లో హీరో వేశాలు వేస్తూ దూసుకుపోతున్నాడు సుధీర్. చిన్న మెజిషియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. అంచెలంచులుగా ఎదుగుతూ ఇప్పుడు స్టార్ అయ్యాడు. ఇప్పుడు బయట అతడికి ఎలాంటి పాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు.
గతంలో సినిమాల్లో చిన్న, చిన్న క్యారెక్టర్లు చేసిన సుధీర్.. ఆ తర్వాతి కాలంలో హీరో అయ్యాడు. సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్, వాంటెడ్ పండుగాడు, గాలోడు వంటి చిత్రాలు చేశాడు. కానీ అవి కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. అయినప్పటికీ ఫాలోయింగ్ ఉండటంతో.. మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి.
సుధీర్‌కు ఇప్పుడు కావాల్సింది మంచి స్టోరీ.. తనను నిలబెట్టగల డైరెక్టర్. తాజాగా ఆ కోరిక నెరవేరినట్లే అనిపిస్తుంది. సంతోషం, మిస్టర్ ఫర్ ఫెక్ట్ వంటి సినిమాలు చేసిన దశరథ్‌తో సుధీర్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ కూడా ముగిసాయని తెలుస్తుంది. ఇక దశరథ్ కొంత కాలంగా లైమ్ లైట్‌లో లేడు. 7 సంవత్సరా క్రితం వచ్చిన శౌర్య మూవీ దశరథ్‌కు చివరి సినిమా. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ ఉంది.
అంతేకాకుండా ఈ సినిమా సుధీర్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారట. ఇక సుధీర్‌కు జోడీగా తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. మరి ఈ మూవీ అయినా సుధీర్‌కు బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.