ఇప్పటిదాకా మన దగ్గర నార్త్ విలన్ల హవానే చూశాం. కానీ నియర్ ఫ్యూచర్‌లో ప్యాన్ ఇండియన్ సినిమాల్లో సౌత్ హీరోల విలనిజాన్ని విట్‌నెస్ చేయడానికి రెడీ అవుతున్నారు మూవీ లవర్స్. తారక్ టు సూర్య... ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోలు ఇదే పనిమీద ఉన్నారు.
ఆల్రెడీ విలన్లుగా వారు ఎలా ఉంటారో మనకు ఓ ఐడియా ఉన్నప్పటికీ, ఇప్పుడు చేస్తున్న సినిమాలు మాత్రం చాలా స్పెషల్... ఆ విషయాలు డీటైల్డ్ గా మాట్లాడుకుందాం రండి... వార్ సీక్వెల్‌తో నార్త్ లో అడుగుపెడుతున్న తారక్ సక్సెస్ కావాలని మన వాళ్లు ఎంతో ఇష్టంగా కోరుకుంటున్నారు.
స్టూడెంట్ నేర్చుకోవడానికి రెడీ అయినప్పుడు, టీచర్ నేర్పించడానికి ప్రత్యక్షమవుతారని, ఇప్పుడు హృతిక్ అందుకు రెడీగా ఉన్నారని సరదాగా కామెంట్ చేశారు తారక్.
కేజీయఫ్‌లో రాకీ భాయ్ హీరోనే. అయినా ప్రతినాయక ఛాయలున్న కేరక్టర్ అది. చూడ్డానికి రఫ్‌గా, సీరియస్‌గా ఉంటారు రాకీ భాయ్. అలాంటి పాత్రతో ప్యాన్ ఇండియా ఆడియన్స్ ని మెప్పించిన యష్ కి, ఇప్పుడు చేయబోయే రావణాసురుడి కేరక్టర్ కష్టంగా ఏమీ ఉండదు. ఆడుతూ పాడుతూ చేసేయగలరనే మాటలు వినిపిస్తున్నాయి. రాకీ భాయ్‌ని రావణాసురుడిగా చూడటానికి ఎలా వెయిట్ చేస్తున్నారో, సూర్యని రోలెక్స్ రోల్‌లో చూడటానికి కూడా అంతే ఇష్టంగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
కల్కిలో కమల్‌హాసన్ ప్రతినాయక ఛాయలున్న కేరక్టర్‌లో కనిపిస్తారన్నది వార్త. ఆయన నెక్స్ట్ చేయబోయే విక్రమ్ సీక్వెల్‌లో రోలెక్స్ రోల్ మాత్రం ఆడియన్స్ లో ఫైర్ పుట్టిస్తోంది. రోలెక్స్ రోల్‌లో సూర్య ఎలా ఉంటారో ఆల్రెడీ గ్లింప్స్ చూసిన వారు, పూర్తి స్థాయిలో సూర్య చెలరేగిపోవడాన్ని స్క్రీన్ మీద చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మన దగ్గర మిరాయ్‌లో విలన్‌గా కనిపిస్తున్నారు మంచు మజోన్. తేజ సజ్జాకి విలన్‌గా మంచు మనోజ్ లుక్ ఎలా ఉండబోతుందనే ఇంట్రస్ట్ క్రియేట్ అయింది.