
హీరో అంటే టక్ జగదీష్‌లాగా ఉండాలన్నది ఓల్డ్ ఫార్మాట్. ఇప్పుడు ట్రెండ్‌లో ఉండాలంటే అందరూ మాస్ మహరాజ్‌లే కావాలి. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌లవ్వాలి. భోళాశంకర్‌లాగా నా వెనుక దునియా ఉంది అనగలగాలి. అప్పుడే ఫ్యాన్స్ లో ఫైర్ పుడుతుంది. బాక్సాఫీస్ బద్ధలైపోతుంది. రెడీ ఒన్, టూ, త్రీ అంటూ లెక్కపెట్టడం మొదలుపెట్టాలేగానీ, వరుసబెట్టి విడుదలకు రెడీ అవుతున్నాయి గ్యాంగ్‌స్టర్ మూవీస్.

టాపిక్ ఏదైనా, సీజన్ ఏదైనా, జోనర్ ఏదైనా... ప్రభాస్‌ని మెన్షన్ చేసి తీరాల్సిందే. ఒకదాని తర్వాత మరొకటి అంటూ దూకుడుమీదున్నారు డార్లింగ్. అదే జోరుతో సలార్‌ను స్క్రీన్స్ మీదకు తీసుకొస్తున్నారు. రెండు చాప్టర్ల సినిమా సలార్‌లో ఇప్పటికే డార్లింగ్ మోస్ట్ వైలెంట్ లుక్ వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యే ఈ మూవీ హిట్ ఆయనకు చాలా స్పెషల్. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్పెషల్‌గా డిజైన్ చేస్తున్నారు కెప్టెన్ ప్రశాంత్ నీల్.

అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ చూసి అబ్బబ్బబ్బబ్బా... అంటూ ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ఇప్పుడు మళ్లీ పీకే ఓజీ అవతార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా శత్రుమూకను చీల్చి చండాడే పవన్ కల్యాణ్ ఎలా ఉంటారా? అని ఆరా తీస్తున్నారు. ఆల్రెడీ 50 శాతం షూటింగ్ పూర్తయింది ఓజీ. పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది ఓజీ.

పుష్పరాజ్ రెయిజింగ్‌ని ఫస్ట్ పార్టులో చూసిన వారందరూ, సెకండ్ పార్టులో రూలింగ్ చూడటానికి సరదా పడుతున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ పుష్పరాజ్ శాసించే తీరును కళ్లారా చూడాలన్నది అల్లు ఆర్మీకే కాదు, ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు కూడా కలే. అంచనాలు ఎలా ఉంటాయో అవగాహన ఉంది కాబట్టి, శ్రద్ధగా తీస్తున్నారు మాస్టారు సుకుమార్.

కోలీవుడ్‌లో విజయ్ లియో గ్యాంగ్‌స్టర్ సినిమానే. లాస్ట్ ఇయర్ సీతారామమ్‌తో అందరి మనసులు టచ్ చేసిన దుల్కర్ సల్మాన్ కూడా కింగ్ ఆఫ్ కోత పేరుతో ఓ సినిమాలో నటిస్తున్నారు. అందులో ఆయన గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నారు. వచ్చే నెల 25న విడుదల కానుంది కింగ్ ఆఫ్ కోత

బాలీవుడ్‌లో సెకండ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా కూడా గ్యాంగ్‌స్టర్ స్టోరీకే ఫిక్సయ్యారు. వయొలెన్సే... భయపడేటంత వయొలెన్స్ తో రణ్‌బీర్ హీరోగా యానిమల్ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్ చేశారు సందీప్. దీన్నిబట్టి ఆయన ఈ మూవీ స్క్రీన్‌ప్లేని ఎలా డిజైన్ చేశారో, స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం జరుగుతుండటంతో విడుదల వాయిదా వేశారు యానిమల్ మూవీ మేకర్స్