
రాశి కన్నా వాసి గొప్పదని నమ్మే స్టార్ హీరో అజిత్. కోలీవుడ్ నెంబర్ వన్ రేసులో ఉన్నా... హరి బరీగా సినిమాలు చేయకుండా... చాలా సెలెక్టివ్‌గా ఉంటారు ఈ స్టార్ హీరో. రీసెంట్ టైమ్స్‌లో అజిత్ మరింత స్పీడు తగ్గించారు. సినిమాతో పాటు రేసింగ్ మీద కూడా కాన్సన్‌ట్రేట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన సిల్వర్ స్క్రీన్ జర్నీని గుర్తు చేసుకున్నారు అజిత్.

సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి 33 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు అజిత్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జర్నీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, అయితే ప్రతీసారి అభిమానుల ప్రేమ తనను నిలబెట్టిందన్నారు.

తన రేసింగ్ జర్నీ గురించి కూడా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు అజిత్. 'అక్కడ కూడా ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. యాక్సిడెంట్స్ అయ్యాయి. నేను ఎదగకుండా అడ్డుకునేందుకు కుట్రలు కూడా చేశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ఇప్పుడు రేసింగ్‌లోనూ పతకాలు సాధించే స్థాయికి వచ్చాను' అంటూ ట్రాక్ మీద పడుతున్న కష్టాన్ని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ సినిమాలు చేయకపోయినా... తనను ఇంతగా అభిమానిస్తున్న వారికి కృతజ్ఞతలు చెప్పారు అజిత్. తన ఫాలోయింగ్‌ను ఎప్పుడు స్వార్థం కోసం వాడుకోనని ప్రామిస్ చేశారు.

ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అజిత్ ఆ తరువాత చేయబోయే సినిమాను ఇంత వరకు ప్రకటించలేదు.