
రాజమౌళి - మహేష్ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అనేది నిన్నమొన్నటిదాకా డిస్కషన్‌లో ఉన్న విషయం. ఇప్పుడు ఎప్పుడు మొదలవుతుంది? ఎవరెవరుంటారు? అనే విషయాల మీద లేదు ఫోకస్. అంతకు మించి ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. అందులోనూ ప్రొడ్యూసర్ కె.ఎల్.నారాయణ చెప్పిన కొన్ని మాటల వల్ల అభిమానుల ఊహలకు రెక్కలొచ్చేశాయి... ఇంతకీ ఏంటవి? కమాన్ లెట్స్ వాచ్...

రేపు సినిమా మొదలయ్యాక అఫీషియల్ లుక్ ఎలా ఉంటుందో అని ఇప్పట్నుంచే కలలు కంటున్నారు మహేష్ అభిమానులు. మ్యాటర్ ఏదైనా.. జస్ట్ తన లుక్స్‌తోనే సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్నారు మహేష్ బాబు.

ఇంటర్నేషనల్ స్థాయిలో ఎక్కడా ఖర్చుకు తగ్గకుండా సినిమా చేస్తానని అనౌన్స్ చేశారు దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్.నారాయణ. 15 ఏళ్ల క్రితమే రాజమౌళి - మహేష్ తో సినిమా చేయాలనుకుంటే ఇప్పటికి సాధ్యమైందని చెప్పారు. అంతే కాదు, రాజమౌళికి హాలీవుడ్ ఆఫర్లు చాలా వచ్చినా వాటికి కాదనుకుని తన సంస్థలో సినిమా చేస్తున్నారని అన్నారు.

కె.ఎల్.నారాయణ ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా... ప్రొడక్షన్ విషయంలో ఇంటర్నేషనల్ కొలాబరేషన్ జరుగుతోందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. రెండు నెలలుగా మహేష్ - జక్కన్న సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ప్రతి చిన్న విషయాన్నీ కె.ఎల్.నారాయణకి చెప్పే చేస్తున్నారట జక్కన్.

ఏదైనా పేపర్ మీద ఉన్నప్పుడే తేల్చుకుంటే బెటర్ అన్నది రాజమౌళి ఫిలాసఫీ అని అంటున్నారు నారాయణ. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంటే, మహేష్ మేకోవర్ విషయంలో సీరియస్‌గా ఉన్నారట. ఆగస్టులోగానీ సెప్టెంబర్‌లోగానీ సినిమా మొదలవుతుందన్నది లేటెస్ట్ న్యూస్. ఈ ఒక్క మాట చాలు.. దమ్ మసాలా బిర్యానీ తిని పండగ చేసుకోవడానికి అంటున్నారు ఫ్యాన్స్.