
హమ్మయ్య... ఓ మంచి విషయం తెలిసింది అని ఆనందించేలోపే, కంగారు పెట్టే విషయాన్ని కూడా చెప్పేస్తున్నారు జక్కన్న! మా సారు మొదలుపెడుతున్నారనుకుని పండగ చేసుకునేలోపే, ఆ స్పీడ్ బ్రేకర్‌లు ఎందుకు జక్కన్నా.. అని చిన్నబుచ్చుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఇంతకీ ఏంటి కహానీ అంటారా? వచ్చేయండి... చూసేద్దాం.

సంక్రాంతికి గుంటూరు కారం వచ్చింది. మరీ మాస్‌గా కనిపించారు మహేష్. నెక్స్ట్ జక్కన్న సినిమా వస్తుంది... అందులో ఇంటర్నేషనల్ స్టార్‌గా యమాగా కనిపిస్తారు మహేష్. ఆ సినిమాకీ, ఈ సినిమాకీ ఎంత తేడా గురూ.... అంటూ రకరకాలుగా తమ స్టార్ గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.

ఇన్నాళ్లూ ఊరించిన ssmb29కి ముహూర్తం ఫిక్స్ అయిందన్నది లేటెస్ట్ న్యూస్. ఈ ఏడాది ఉగాదికి సినిమా టీమ్ అందరినీ పరిచయం చేస్తారట జక్కన్న. పనిలో పనిగా అప్పుడే సుముహూర్తాన్నీ ఖరారు చేశారట. అద్భుతమైన సెట్ వేసి, సినిమా ఓపెనింగ్ చేసేయాలని అనుకుంటున్నారట.

ఓపెనింగ్ కాగానే, వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా ఉంటుందా? అని ఎవరైనా ఆత్రుతగా అడిగితే మాత్రం... నో అనే సమాధానమే వినిపిస్తోంది. ముహూర్తం అయ్యాక కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంటారట. ఆ తర్వాతే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారన్నది టాక్.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతున్నాయి. మరోవైపు లొకేషన్ల వేట కూడా మొదలైంది. ఇంకో వైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. అటు మహేష్ తనవంతుగా కేరక్టర్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. వీటన్నిటిని బట్టి, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ పూర్తిస్థాయిలో తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేశారన్నమాట...