
ఊ అంటావా సామ్.. ఉ ఊ అంటావా అని అడిగితే.. అప్పుడేదో ఊ అన్నాను కానీ, ఇప్పుడు మాత్రం ఉ ఊనే అని సమాధానం ఇస్తున్నారు సమంత. తాను చేయగలనా? తనను జనాలు అంత హాట్‌గా ఊహించుకోగలరా? తరహా ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ఊ అంటావా పాట నిలిచిందన్నది సామ్ ఫీలింగ్.

ఫ్యూచర్‌లో మాత్రం స్పెషల్ సాంగ్స్ చేసే ఉద్దేశం లేదంటున్నారు సమంత. ఆ పాటను జస్ట్ అలా చేయాలనిపించి, చేసేశానంతే అని అంటున్నారు.

పుష్ప2లో కిస్సిక్ చేసిన శ్రీలీల కూడా ఈ తరహా కామెంట్లే పాస్ చేశారు. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. అందుకే డ్యాన్స్ బేస్డ్ సాంగ్, అందులోనూ బన్నీతో స్టెప్పులేసే అవకాశం రావడంతో కిస్సిక్ సాంగ్‌కి ఓకే చెప్పానన్నారు శ్రీలీల.

మరి ఫ్యూచర్‌లో ఇలాంటి సాంగుల ఆఫర్లు వస్తే పరిస్థితి ఏంటి? అని అడిగితే... సైలెంట్‌గా తన స్టైల్‌లో నవ్వేశారు శ్రీలీల. పెద్ది సినిమాలో శ్రీలీల స్టెప్పులేస్తారనే టాక్ నడుస్తోంది. కానీ, దీని గురించి కిస్సిక్ బ్యూటీ మాత్రం స్పందించడం లేదు.

నార్త్ లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, సౌత్‌లో గ్యాప్ కనిపించకుండా స్పెషల్‌గా ఈ పాటలతో కనిపించడానికి సిద్ధమయ్యారా? అనే టాక్ కూడా ఉంది. తరచూ కాకపోయినా అప్పుడప్పుడూ జిగేల్‌మనిపించడంలో తప్పేం లేదంటూ సలహాలూ అందుతున్నాయి మన బ్యూటీలకు.