
Sree Vishnu: శ్రీవిష్ణు హీరోగా లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. 60 శాతం చిత్రీకరణ పూర్తయిందని చెప్పారు. వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు.

Samyuktha Menon: మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారిని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో ఆదిశక్తి సంస్థను ప్రారంభించానని అన్నారు నటి సంయుక్త. అన్ని వయసుల మహిళలకు ఈ సంస్థ చేయూతనిస్తుందని చెప్పారు. విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం వంటి విషయాల్లో మహిళలకు సపోర్ట్ గా నిలుస్తామని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ గొంతు వినిపించాలనేది ఆదిశక్తి సంస్థ ఉద్దేశమని చెప్పారు.

Thiruveer: తిరువీర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా పోస్టర్ విడుదలైంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కి అనుగుణంగా మైథలాజికల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు మేకర్స్. త్రేతాయుగానికి, కలియుగానికి మధ్య ఈ కథ జరుగుతుంది. థ్రిల్లింగ్ అంశాలతో అందరినీ మెప్పిస్తుందని అన్నారు తిరువీర్.

ముఖ్యంగా టైటిల్ రోల్‌లో విక్రమ్ పెర్ఫామెన్స్ సూపర్బ్ అనిపించేలా ఉంది. ఓవరాల్‌గా ట్రైలర్‌తో కంటెంట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.

Animal: సినిమాల్లో కంటెంట్ ఎప్పుడూ కింగ్ అని అన్నారు విద్యాబాలన్. అంతకన్నా ముఖ్యమైనది ప్రాజెక్ట్ మీద టీమ్‌కి ఉన్న నమ్మకం అని తెలిపారు. యానిమల్ సినిమా విషయంలో ఎన్ని విమర్శలు ఎదురైనా చిత్ర బృందం ఎవరికీ ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదని అన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించడంలో సినిమా విజయవంతమైందని చెప్పారు విద్యాబాలన్.