శోభితా ధూళిపాళ్ల.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ ఎక్కువే.
ఏపిలోని తెనాలి ప్రాంతానికి చెందిన ఈ అమ్మడు తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా..బాలీవుడ్లోనూ కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ మోడల్ గా రాణించడం ద్వారా అవకాశాలు అందుకుంది.
అడివి శేష్ నటించిన గూఢచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హీరోయిన్ పాత్రలే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటిస్తుంది.
అటు వెబ్ సిరీస్ లతో ఓటీటీలోనూ సందడి చేస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తుంది.
చీరకట్టు.. ముక్కు పుడకతో భలే అందంగా ఉంది ఈ ముద్దుగుమ్మ అంటూ ప్రశంసించే విధంగా కనిపిస్తుంది. ప్రస్తుతం శోభితా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
'కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి.. మువ్వుల బొమ్మా ముద్దుల గుమ్మా'.. అందాల వయ్యారి శోభితా..