- Telugu News Photo Gallery Cinema photos Sivakarthikeyan and ranveer singh act in rajinikanth next movie with lokesh kanagaraj Telugu Heroes Photos
Rajinikanth: రజిని బౌన్స్ బ్యాక్.! సూపర్ స్టార్ నెక్స్ట్ మూవీలో శివకార్తికేయన్ , రణ్ వీర్..
జైలర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్, నెక్ట్స్ చేయబోయే సినిమాల విషయంలోనే సక్సెస్ సెంటిమెంట్స్‌ను కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా జైలర్‌కు హెల్ప్ అయిన మల్టీ స్టారర్ ఫార్ములాను ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలన్నింటిలోనూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సారి కాంబోస్ పాన్ ఇండియా రేంజ్‌లో సెట్ చేస్తున్నారు. జైలర్ సక్సెస్ అభిమానులకే కాదు తలైవాకు కూడా కొత్త జోష్ ఇచ్చింది. అందుకే అప్ కమింగ్ సినిమాలను అదే రేంజ్‌లో సెట్ చేస్తున్నారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Dec 24, 2023 | 3:10 PM

జైలర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్, నెక్ట్స్ చేయబోయే సినిమాల విషయంలోనే సక్సెస్ సెంటిమెంట్స్‌ను కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా జైలర్‌కు హెల్ప్ అయిన మల్టీ స్టారర్ ఫార్ములాను ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలన్నింటిలోనూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు.

అంతేకాదు ఈ సారి కాంబోస్ పాన్ ఇండియా రేంజ్‌లో సెట్ చేస్తున్నారు. జైలర్ సక్సెస్ అభిమానులకే కాదు తలైవాకు కూడా కొత్త జోష్ ఇచ్చింది. అందుకే అప్ కమింగ్ సినిమాలను అదే రేంజ్‌లో సెట్ చేస్తున్నారు. ఆల్రెడీ జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టయన్ మూవీ స్టార్ట్ చేసిన రజనీ..,

ఆ మూవీలో అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ మూవీలో బిగ్ బీ కాస్త లెంగ్తీ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు. వేట్టయన్ సెట్స్ మీద ఉండగానే ఆ తరువాత చేయబోయే మూవీ వర్క్ కూడా స్టార్ చేశారు.

లియో తరువాత రజనీకాంత్ హీరోగా ఓ సినిమా చేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ మూవీ కాస్టింగ్ సెట్ చేస్తున్నారు.

దాదాపు తన సినిమాలన్నింటినీ మల్టీస్టారర్స్‌గానే ప్లాన్ చేస్తున్న లోకేష్, రజనీ కోసం మరింత భారీ సెటప్ సిద్ధం చేస్తున్నారు. లియో సినిమా కోసం బాలీవుడ్ సీనియర్ సంజయ్ దత్‌ను రంగంలోకి దించిన లోకేష్ కనగరాజ్..,

రజనీ మూవీ కోసం యంగ్ హీరోను ట్రై చేస్తున్నారు. బాలీవుడ్ రాక్ స్టార్ రణవీర్ సింగ్‌ను గెస్ట్ రోల్‌కు సంప్రదించారు. రజనీ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా నో చెప్పే ఛాన్సే లేదు. జస్ట్ డేట్స్ సెట్ అయితే చాలు, రణవీర్ సౌత్ ఎంట్రీ ఫిక్స్ అయినట్టే అంటున్నారు కోలీవుడ్ జనాలు.

ఆల్రెడీ రజనీ, లోకేష్ సినిమాలో కీలక పాత్రలో శివ కార్తికేయన్ నటించటం కన్ఫార్మ్ అయ్యింది. ఇప్పుడు రణవీర్ సింగ్ పేరు కూడా వినిపిస్తుండటంతో రజనీ నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందంటున్నారు క్రిటిక్స్.





























