Tollywood News: అటెన్షన్‌ ప్లీజ్‌.. సింగిల్‌ థియేటర్లకు క్రౌడ్‌ పుల్లర్స్ కావలెను

| Edited By: Phani CH

Aug 11, 2024 | 11:09 AM

అటెన్షన్‌ ప్లీజ్‌... సింగిల్‌ థియేటర్లకు క్రౌడ్‌ పుల్లర్స్ కావలెను... జస్ట్ క్రేజీ డేట్‌ ఉందనో, ఓ ఒక్క వారం కనిపించి వెళ్దామనో వచ్చేవారు కాదు.. వారా వారం... థియేటర్లలో ఫుట్‌ఫాల్‌ పెంచే చరిష్మా ఉన్న హీరోల సినిమాలు కావాలి... ఇంతకీ ఈ విషయాన్ని స్టార్‌ హీరోలు వింటున్నట్టేనా? థియేటర్లు పది కాలాల పాటు పచ్చగా ఉండాలంటే జనాలతో కిక్కిరిసిపోవాలి. ఫ్యాన్స్ లో పూనకాలు లోడ్‌ అవ్వాలి.

1 / 5
అటెన్షన్‌ ప్లీజ్‌... సింగిల్‌ థియేటర్లకు క్రౌడ్‌ పుల్లర్స్ కావలెను... జస్ట్ క్రేజీ డేట్‌ ఉందనో, ఓ ఒక్క వారం కనిపించి వెళ్దామనో వచ్చేవారు కాదు.. వారా వారం... థియేటర్లలో ఫుట్‌ఫాల్‌ పెంచే చరిష్మా ఉన్న హీరోల సినిమాలు కావాలి... ఇంతకీ ఈ విషయాన్ని స్టార్‌ హీరోలు వింటున్నట్టేనా?

2 / 5
థియేటర్లు పది కాలాల పాటు పచ్చగా ఉండాలంటే జనాలతో కిక్కిరిసిపోవాలి. ఫ్యాన్స్ లో పూనకాలు లోడ్‌ అవ్వాలి. అప్పుడే రిపీటెడ్‌ ఆడియన్స్ ఉంటారు. అలా ఉన్నప్పుడే థియేటర్లు కళకళలాడుతాయి. స్టార్‌ హీరోల సినిమాలు నెలలో ఒకటో, రెండో పలకరిస్తేనే ఆ సందడి కనిపిస్తుంది.

3 / 5
సంక్రాంతికో, దసరాకో, సమ్మర్‌కో వస్తాం... మిగిలిన టైమ్‌ మాది కాదు అని స్టార్‌ హీరోలు సైలెంట్‌ అయితే   సీన్‌ ఇంకోలా ఉంటుంది. ఒక్కసారి థియేటర్లలో విడుదల చేసి, మమ అనిపించుకుంటే ఓటీటీల్లో విడుదల చేసేయొచ్చని  చిన్న సినిమాల మేకర్స్ అనుకుంటే మాత్రం... థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది.

4 / 5
సినిమాలకూ, మాస్‌ జనాలకు మధ్య బ్రిడ్జిలాంటిది సింగిల్‌ థియేటర్ల సిస్టమ్‌. ఒక్కసారి ఆ వ్యవస్థ కూలితే, సగటు సినిమా... మల్టీప్లెక్సులకు, డిజిటల్‌ ప్లాట్‌ఫార్ములకు పరిమితమయ్యే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే ఓటీటీల వాళ్లు పెట్టిన రూల్స్ కి మేకర్స్ తలలూపాల్సిన పరిస్థితి తప్పదు.

5 / 5
కొత్త పోకడలను ఆహ్వానిస్తూ, పాత పద్ధతులను పరిరక్షించుకుంటూ ముందుకు సాగితేనే వందేళ్ల సినిమా వైభవాన్ని భావి తరాలకు అందించిన వాళ్లవుతామనే విషయాన్ని స్టార్లు గుర్తించాలి.  ఏడాదికి ఒకటీ, రెండూ రిలీజులు అంటూ లెక్కపెట్టుకుంటూ కూర్చోకుండా, మల్టీ పుల్‌ ప్రాజెక్టులతో ప్యాన్‌ ఇండియన్‌ స్టార్లు దూకుడు చూపించాలని అంటున్నారు క్రిటిక్స్.