
టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్ గా అవకాశాలు సొంతం చేసుకుంటుందామె.

ఒక్క తెలుగులోనే కాదు కన్నడ సినిమా ఇండస్ట్రీలోనూ ఈ బ్యూటిఫుల్ సింగర్ కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు మంగ్లీతో పాటు ఆమె చెల్లి కూడా సింగర్ గా అదరగొడుతోంది.

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వ పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ పాటతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్.

ఇందులో ఆమె హస్కీవాయిస్ కు అందరూ ఫిదా అయిపోయారు. పుష్పతో పాటు కొన్ని తమిళ సినిమాల్లోని సాంగ్స్ కు కూడా గాత్రం అందించింది ఇంద్రావతి.

అన్నట్లు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఇంద్రావతి చౌహాన్. తన పర్సనల్ అండ్ ఫ్రొషెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్స్ తో పాటు గ్లామరస్ ఫొటోలను కూడా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది.

అలా తాజాగా ఇంద్రావతి చౌహాన్ మోడ్రన్ లుక్ లో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.