
ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన కూతురు ఆరాధ్యతో కలిసి దుబాయ్‌లో జరిగిన SIIMA 2024 ఈవెంట్‌కి హాజరైంది. ఈసారి తల్లీ కూతుళ్లు ఇద్దరూ రెడ్ కార్పెట్ పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఐశ్వర్య, ఆరాధ్యల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఐష్ కూతురు ఆరాధ్య బచ్చన్ మునుపటి కంటే క్యూట్ గా ఉందని క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఐశ్వర్యరాయ్ ఎక్కడికి వెళ్లినా ఆరాధ్య అక్కడే ఉంటుంది. ఇంతకుముందు ఆరాధ్య, ఐశ్వర్య కలిసి చాలా అవార్డు షోలకు వచ్చారు.

ఇప్పుడు ఐశ్వర్య తన కుమార్తెతో కలిసి SIIMA 2024 కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

సైమా- 2024 అవార్డుల్లో ఐశ్వర్య 'ఉత్తమ నటి' (క్రిటిక్స్) పురస్కారం గెలుచుకుంది. 'పొన్నియిన్ సెల్వన్ 2'లో ఆమె నటనకు గాను ఈ అవార్డు లభించింది.

ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ ఉత్తమ నటిగా అవార్డు తీసుకుంటుండగా.. ఆరాధ్య ఫుల్ ఆనందంతో ఫొటోలను తీస్తూ కనిపించింది.