రొమాంటిక్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిథి రావు హైదరీ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. కొంతకాలంగా సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న ఈ ప్రేమ పక్షులు త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. అయితే పెళ్లికి ముందే ఈ లవ్ బర్డ్స్ సమ్మర్ వెకేషన్ కోసం ఇటలీ వెళ్లిపోయారు.
ఇటలీలోని టస్కనీ వెకేషన్ కు వెళ్లిన సిద్ధార్థ్, అదితీ రావు అక్కడి అందమైన ప్రదేశాలను ఆస్వాదించారు. అనంతరం తమ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
ఇటలీలోని ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తూ క్లోజ్‌గా దిగిన ఫోటోలను తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో షేర్ చేశారీ లవ్ బర్డ్స్. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు మేడ్ ఫర్ ఈజ్ అదర్ అంటూ ఈ జంటకు విషెస్ చెబుతున్నారు. అలాగే పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గత మార్చిలో సిద్దార్థ్, అదితిలో వనపర్తిలోని ఓ ప్రముఖ దేవాలయంలో చాలా సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే చాలామంది మొదట ఈ వేడుకను పెళ్లి అనుకున్నారు.
దీంతో వెంటనే తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు సిద్ధార్థ్, అదితి. నిశ్చితార్థం చేసుకున్నామంటూ రింగ్‌లు తొడుక్కున్న ఫోటోలు షేర్ చేసి క్లారిటీ ఇచ్చారు.