సైలెంట్ కిల్లర్.. చాప కింద నీరు.. ఇలాంటి పదాలన్నీ శృతి హాసన్‌కు బాగా సూట్ అవుతాయి. రేసులో లేనట్లే కనిపిస్తున్నా.. జోరు మాత్రం తగ్గించట్లేదు ఈ బ్యూటీ. తాజాగా శృతి నటిస్తున్న మూడు సినిమాల బ్యాగ్రౌండ్ చూస్తుంటే.. ఆమె కెరీర్‌పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
మరి ముగ్గురు సూపర్ స్టార్స్‌తో ఒకేసారి నటిస్తున్నా.. డేట్స్ విషయంలో చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకుండా శృతి హాసన్ తీసుకుంటున్న జాగ్రత్తలేంటి..? ఆమె చేస్తున్న సినిమాలేంటి..? చడీ చప్పుడు లేకుండా సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతున్నారు శృతి హాసన్.
గతేడాది క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు ఈమె. రవితేజతో బలుపు తర్వాత ఈమె నటించిన క్రాక్ బ్లాక్‌బస్టర్ అయింది. దాంతో అమ్మడు తెలుగులో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయారు. ఒకేసారి ముగ్గురు స్టార్స్‌తో నటించే అవకాశం అందుకున్నారు.
చిరంజీవితో వాల్తేరు వీరయ్య.. బాలయ్య 107.. ప్రభాస్ సలార్ సినిమాల్లో శృతి నటిస్తున్నారు.
ప్రభాస్ సలార్ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. ఇందులో ఆద్య పాత్రలో నటిస్తున్నారు శృతి.
కేజియఫ్‌లో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు ప్రశాంత్ నీల్. అలాగే సలార్‌లోనూ శృతి చాలా కీలకంగా ఉండబోతున్నారు. ఇప్పటికే ఈమె పాత్ర షూటింగ్ చివరిదశకు వచ్చింది.
అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న NBK 107లో షూటింగ్‌లోనూ ఎప్పుడో జాయిన్ అయ్యారు శృతి హాసన్. ఓ వైపు ప్రభాస్.. మరోవైపు బాలయ్య సినిమాలతో బిజీగా ఉన్న శృతి..
తాజాగా చిరంజీవి సినిమాకు షిఫ్ట్ అయ్యారు. వాల్తేరు వీరయ్య సెట్‌లోకి శృతి అడుగు పెట్టినట్లు తెలుస్తుంది. బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూడు సినిమాలు తక్కువ గ్యాప్‌లోనే విడుదల కానున్నాయి. దసరాకు బాలయ్య.. సంక్రాంతికి చిరంజీవి.. సమ్మర్‌కు సలార్ విడుదల కానున్నాయి.
వీటితో శృతి మళ్లీ టాప్‌కు వెళ్లిపోవడం ఖాయం.