
కోలీవుడ్‌లో బయోపిక్స్ సందడి మళ్లీ ఊపందుకుంది. ఇళయరాజా బయోపిక్ తెరకెక్కుతోంది. మరోవైపు రజనీకాంత్ బయోపిక్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

సరిగ్గా ఇదే ట్రెండ్‌లో కమల్‌హాసన్ బయోపిక్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఈ బయోపిక్‌ని శ్రుతి డైరక్ట్ చేయబోతున్నారా? మాట్లాడుకుందాం... వచ్చేయండి...

రీసెంట్ టైమ్స్ లో కమల్‌హాసన్ - శ్రుతి కలిసి ఎక్కువగా కనిపిస్తున్నారు జనాలకు. బోయ్‌ఫ్రెండ్‌తో విడిపోయాక, తండ్రి గైడెన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు శ్రుతి అన్నది టాక్. ఈ క్రమంలోనే ఈ మధ్య శ్రుతి చేసిన ట్యూన్‌కి కమల్ లిరిక్స్ రాశారన్న మాట వినిపిస్తోంది.

పర్సనల్‌గానే కాదు, ప్రొఫెషనల్‌గా కూడా వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారన్నది ఇంకో మాట. ఆల్రెడీ మ్యూజిక్ డైరక్టర్, లిరిసిస్ట్ రిలేషన్‌షిప్ వచ్చేసింది. త్వరలోనే డైరక్టర్, యాక్టర్ బాండింగ్ స్టార్టవుతుందన్నది కోలీవుడ్ న్యూస్. కమల్‌హాసన్ బయోపిక్‌ని శ్రుతి డైరక్ట్ చేస్తారనే విషయం తమిళ వర్గాల్లో వైరల్ అవుతోంది.

కానీ అందులో నిజం లేదని చెప్పేశారు శ్రుతిహాసన్. తన తండ్రిలాంటి లెజెండ్ బయోపిక్ తీయడానికి చాలా మంది సమర్థులైన దర్శకులు ఉన్నారని అన్నారు. బయోపిక్ పని వాళ్లు చూసుకుంటారని, తనకు డైరక్ట్ చేసే ఉద్దేశం లేదని చెప్పేశారు.ప్రస్తుతం కమల్‌హాసన్ అండ్ శ్రుతి... ఇద్దరూ చేతినిండా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు.