
శ్రియ శరన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టాలివుడ్ లో వరుస హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన నటించింది.

మొట్టమొదట 'ఇష్టం' సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయమైన శ్రియ.. తర్వాత నుండి వరుసగా టాప్ హీరోల తో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తన నటన తో అందరిని ఆకట్టుకుని ఓకే ప్రత్యేకమైన ఫ్యాన్స్ ను సంపాదించుకుంది శ్రియ.

నాగార్జున హీరోగా తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. ఆ వెంటనే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి మూవీలో శ్రియ నటించారు.ఆ సినిమా కూడా భారీ హిట్ ను అందుకుంది.

ఆమె గతంలో స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ సినిమాల్లో ఊపేసింది. అప్పట్లో ఆమె సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఎగబడేవారు.

కెరీర్ పీక్స్ లో ఉండగా 2018 సంవత్సరంలో రష్యా క్రీడాకారులు ఆండ్రూ కొచ్చిన్ ను పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. తరువాత కొన్ని రోజులు సినిమాలకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ.

కాకపోతే సోషల్ మీడియాలో వేదికగా మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటూ నెట్టింట రొమాంటిక్ స్టిల్స్ షేర్ చేస్తూ అప్‌డేట్స్ తన అప్డేట్స్ ఇస్తూ వచ్చింది.

శ్రియ ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. దానికి సంబంధించిన ప్రతి మూమెంట్‌ను ఈమె అభిమానులతో పంచుకుంటోంది. అంతేకాదు ఎప్పటి కపుడు తన బిడ్డకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటోంది.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ తల్లి పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ భార్య పాత్రలో నటించింది.

సినిమాల్లో అడుగుపెట్టినప్పుడు.. ఎంత అందంతో ఆకట్టుకుందో.. ఇప్పటికీ అంతే అందంతో ఆకట్టుకుంటున్నారు నటి శ్రియ.