
శోభా శెట్టి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇందులో విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

కార్తీకదీపం సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకుంది ఈ అమ్మడు.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చి అంతకు మించిన నెగిటివిటీని సొంతం చేసుకుంది.

దీంతో తెలుగులో మరో సీరియల్ ఛాన్స్ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియా, యాట్యూబ్ లో తన కంటెంట్ పోస్ట్ చేస్తూ జనాలకు దగ్గరగా ఉంటుంది. నిత్యం తన లైఫ్ స్టైల్ విషయాలను పంచుకుంటుంది.

తాజాగా వరలక్ష్మి వ్రతం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పసుపు రంగు చీరలో ఎంతో అందంగా ముస్తాబయ్యింది. ఇందుకు సంబంధించిన పిక్స్ వైరలవుతున్నాయి.

శోభా శెట్టి తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అందమైన విలన్. కార్తక దీపం సీరియల్లో మోనిత పాత్రతో దగ్గరైన శోభా.. ఆ తర్వాత మరో సీరియల్ చేయలేదు. ఈ బ్యూటీకి నెట్టింట ఫుల్ ఫాలోయింగ్ ఉంది.