
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ యాక్షన్ డ్రామా భారతీయుడు. 28 ఏళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

మరి వాటన్నింటినీ సేనాపతి ఫేస్ చేస్తారా..? అసలు భారతీయుడు 2 ముందున్న సవాళ్లేంటి..? 1996లో భారతీయుడు సినిమా వచ్చింది.. అప్పటికి మీడియా ఈ స్థాయిలో లేదు కాబట్టి శంకర్ ఏం చూపించినా కొత్తగా చూసారు ఆడియన్స్. కానీ ఇలాంటి కథనే ఇప్పుడు మళ్లీ తీసి మెప్పించడం అంటే సులభమైతే కాదు.

పైగా ఈ మధ్య శంకర్ అంతగా ఫామ్‌లో లేరు. ఆయన చివరగా తెరకెక్కించిన 2.0, ఐ సినిమాలు అంచనాలు అందుకోలేదు. భారతీయుడు 2 కమల్ హాసన్ కంటే శంకర్‌కు అత్యంత కీలకంగా మారిందిప్పుడు. ఒకప్పుడు సామాజిక అంశాలనే కథలుగా చేసుకుని సినిమాలు చేసిన శంకర్..

కొన్నేళ్లుగా ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ సినిమాలు చేస్తూ వచ్చారు. తనలో ఇంకా ఆ వింటేజ్ శంకర్ అలాగే ఉన్నారని నిరూపించుకోవాలంటే.. భారతీయుడు 2 కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అదే జరిగితే శంకర్ మేనియా మొదలైనట్లే. 28 ఏళ్ల నాటి పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరు.

భారతీయుడుకి చావే లేదంటూ మరోసారి యాక్షన్‌లోకి దిగిన కమల్ హాసన్, థియేటర్లలో సందడి చేస్తున్నారు. ముందు నుంచి చెబుతున్నట్టుగా భారతీయుడు 2 ఎండింగ్‌లో సర్‌ప్రైజ్ యాడ్ చేసింది యూనిట్.

అంతేకాదు పార్ట్ 3లో యంగ్ కమల్ హాసన్ ఆడియన్స్‌ను అలరించబోతున్నారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొనక ముందు సేనాపతి ఎవరు..? అతని కుటుంబ నేపథ్యం ఏంటి? లాంటి డిటైల్స్ కూడా పార్ట్ 3లో చూపించబోతున్నారు.