
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన చిత్రం 'డంకీ'. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామాలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్‌లతో స్క్రీన్‌ను పంచుకున్నారు .

సలార్ కు పోటీగా డిసెంబర్ 21న విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. అయితే ఆరు రోజుల్లో రూ. 280 కు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు పండితున్నారు.

కాగా డంకీ సినిమా బడ్జెట్‌పై పలు వార్తలు వస్తున్నాయి. కొందరు లో బడ్జెట్ మూవీ అంటున్నప్పటికీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. తాజాగా ఇదే విషయమై ఓ నెటిజన్ షారుక్ ఖాన్‌కు ఓ ప్రశ్న సంధించాడు.

సార్ డంకీ సినిమా బడ్జెట్ పై చాలా గాసిప్స్ వచ్చాయి. 85 కోట్ల రూపాయలు అంటున్నారు కొందరు. 120 కోట్ల రూపాయలు అంటున్నారు కొందరు. మరికొందరు 350 కోట్ల రూపాయలు అంటున్నారు. అందుకే మిమ్మల్నే నేరుగా అడుగుదాం అనుకున్నాను' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

దీనికి స్పందించిన షారుక్.. 'బ్రదర్.. ఎవరికి ఇష్టం వచ్చింది అనుకోని. ఇలాంటి వాటిపై కాకుండా వేరే విషయాలపై కాస్త దృష్టి పెట్టు' అని సదరు నెటిజన్‌కు కౌంటరిచ్చాడు షారుక్. ప్రస్తుతం షారుక్ సమాధానం నెట్టింట వైరల్‌గా మారింది.