
రెండు బ్లాక్ బస్టర్ తరువాత సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ చేసిన సినిమా డంకీ. డ్రీమ్ కాంబో రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేట్రికల్‌గా అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయిన డంకీ ఆడియన్స్‌ను నిరాశపరిచింది. ఈ బాధలో ఉన్న షారూఖ్ ఫ్యాన్స్‌ను ఓ న్యూస్ ఫుల్ ఖుషీ చేస్తోంది.

షారూఖ్ ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా డంకీ. దేశాల మధ్య అనుమతులు లేకుండా ప్రయాణించే వాళ్ల కథతో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా పెర్ఫామ్ చేయలేకపోయింది. ముఖ్యంగా షారూఖ్, హిరానీ కాంబో మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ కాలేకపోయింది.

వసూళ్ల విషయంలోనూ డంకీ చాలా వెనుకబడింది. ఒక్క రోజు తేడాతో రిలీజ్ అయిన సలార్ వందలకోట్ల వసూళ్లతో దూసుకుపోతుంటే, డంకీ మాత్రం నెమ్మదిగా ముందు సాగుతోంది.

లిమిటెడ్ బడ్జెట్‌లో రూపొందించిన సినిమా కావటంతో ఆల్రెడీ ప్రాఫిట్స్‌లోకి వచ్చేసినా.. బాద్‌షా గత చిత్రాలతో పోలిస్తే చాలా తక్కువ వసూళ్లు సాధిస్తోంది.

ఈ పరిస్థితుల్లో షారూఖ్ అభిమానులను ఖుషీ చేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. త్వరలో డంకీ సినిమాను రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించబోతున్నారు. మంచి థీమ్‌తో సందేశాత్మకంగా తెరకెక్కిన సినిమాలకు మాత్రం ఈ అవకాశం దక్కుతుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ డంకీకి రావటంతో కింగ్ ఖాన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.