
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు సీనియారిటీ వచ్చేశాక.. స్టార్ హీరోల పక్కనే సందడి చేయాలనుకుంటారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న వారితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఇప్పుడు ఈ ఫార్ములాను బ్రేక్ చేస్తున్నారు కొందరు హీరోయిన్లు. ఇంతకీ ఎవరు వారు?

రీఎంట్రీలో అనుష్కకు లక్కీ సినిమాగా మారింది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టితో కలిసి నటించారు స్వీటీ. ఆల్రెడీ స్టార్‌డమ్ ఉన్న అనుష్క, నవీన్‌తో జోడీ కడుతున్నారనే మాటే అప్పట్లో సినిమాకు క్రేజ్ తెచ్చింది.

త్వరలో సుహాస్‌తో ఓ సీరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కీర్తీ సురేష్. రీసెంట్‌గా ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం లోకేష్ కనగరాజ్‌తో జోడీ కట్టారు శ్రుతిహాసన్. వీరిద్దరి జోడీకి మంచి బజ్ క్రియేటైంది. త్వరలో సిల్వర్‌స్క్రీన్ మీద కూడా ఇలాంటి కాంబోలు హల్‌చల్ చేయనున్నాయి.

త్వరలో రిలీజ్ కానున్న సత్యభామ సినిమాలో నవీన్‌చంద్రతో కలిసి కనిపిస్తున్నారు కాజల్ అగర్వాల్. కమ్ బ్యాక్‌లో ఇండస్ట్రీలో గట్టిగా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నారు సిల్వర్ స్క్రీన్ సత్యభామ.

రష్మిక ఓ వైపు స్టార్ హీరోల చిత్రాలకు సైన్ చేస్తూనే, మరోవైపు చిన్న హీరోల సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అటు గర్ల్ ఫ్రెండ్ మూవీలో దీక్షిత్ శెట్టితో నటిస్తున్నారు. రెయిన్‌బో మూవీలో దేవ్ మోహన్‌తో జోడీ కడుతున్నారు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్నా , కథ నచ్చితే హీరోలు ఎవరనే విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు మన నాయికలు.