Actress Rashi: ఆ హీరోకు తల్లిగా అస్సలు నటించను..కానీ రాశి ఆసక్తికర కామెంట్స్..
చాలా కాలం హీరోయిన్ గా మెప్పించిన రాశి ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ తో ఆకట్టుకుంటున్నారు రాశి. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో పాటు.. టీవీ సీరియల్స్ లోనూ నటిస్తున్నారు రాశి. తాజాగా రాశి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ జనరేషన్ హీరోలలో ప్రభాస్ అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు. అన్నారు రాశి. ప్రభాస్ సినిమాలో నటించాలని తాను ఆశ పడుతున్నానని తెలిపారు రాశి.