
రంభ.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఆ ఒక్కటి అడక్కుతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. హిట్లర్, బావగారు బాగున్నారా లాంటి సినిమాలతో స్టార్ అయిపోయారు. మలయాళం, తమిళంలోనూ రంభకు మంచి ఫాలోయింగ్ ఉంది.

2007లో దేశముదురులో స్పెషల్ సాంగ్ చేసాక.. పెళ్లి చేసుకుని కెనడాలో సెటిల్ అయిపోయారు. గ్లామర్ క్వీన్ ఇమేజ్‌తో ఒకప్పుడు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసారు రంభ. స్టార్ హీరోలందరితోనూ నటించిన రంభ.. స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిసారు.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, హలో బ్రదర్, మృగరాజు లాంటి సినిమాల్లో చిందేసారు. ఇన్నేళ్ళకు మళ్లీ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు రంభ. పిల్లలు పెద్దోళైపోయారు.. ఇక నేనుస్తున్నా అన్నారు ఈ సీనియర్ హీరోయిన్.

తమ పిల్లలిప్పుడు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారని.. తనపై ఆధారపడట్లేదని.. అందుకే రీ ఎంట్రీపై ఫోకస్ చేస్తున్నానని తెలిపారు రంభ. తనకు నటనపై ఉన్న ఆసక్తి భర్తకు కూడా తెలుసు కాబట్టే ఆయన కూడా ఓకే అన్నారన్నారు ఈమె. ఈ మధ్యే ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా చేసిన రంభ.. త్వరలోనే సినిమాలు కూడా చేస్తానంటున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే 90స్ హీరోయిన్స్ చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. తాజాగా రంభ కూడా అదే దారిలో వెళ్తున్నారు. ఆ మధ్య మహా సముద్రం సినిమాలో రంభపై ఉన్న అభిమానంతో ఏకంగా ఓ పాటనే పెట్టారు దర్శకుడు అజయ్ భూపతి. మొత్తానికి చూడాలిక.. రంభ రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో..?