
టాలీవుడ్ సీనియర్ నటి శ్రియా శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. సీనియర్ హీరోలు అందరి సరసన నటించి, తన నటనతో ఎంతో మంది మదిని తోచుకుంది ఈ బ్యూటీ.

వరసగా సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, వివాహమై, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ అమ్మడు కరోనా తర్వాత నుంచి ఇండస్ట్రీకి దూరమైంది. తన ఫ్యామిలీకి టైమ్ కేటాయించి, వారితో ఎంజాయ్ చేస్తుంది.

ఇక తర్వాత సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దీంతో చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ, వీలైనప్పుడల్లా వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గోవా ట్రిప్‌లో ఉంది.

వీకెండ్‌లో చాలా సంతోషంగా తన కూతురు, భర్తతో కలిసి గోవాకి వెళ్లిన ఈ బ్యూటీ, అక్కడ ప్రకృతిలో సేద తీరుతూ ఎంజాయ్ చేస్తుంది. స్విమ్మింగ్ ఫూల్‌లో తన భర్త, పాపతో కలిసి ఆనందంగా గడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీంతో నటి శ్రియా షేర్ చేసిన ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన ఈ బ్యూటీ అభిమానులు క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి