
మహేష్ బాబు, విక్టరి వెంకటేష్ కలిసి నటించి మంచి హిట్ అందుకున్న మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ మూవీలో ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారనే చెప్పాలి. ఈ మూవీలో తమ నటనతో చాలా మంది నటీనటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో అభినయ ఒకరు.

అభినయ గురించి ఎంత చెప్పినా తక్కువే. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన ఈ బ్యూటీ కానీ తన నటనతో మాత్రం స్టార్ స్టేటస్ అందుకుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు చెల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అచ్చం తెలుగు అమ్మాయిలా సాంప్రదాయంగా కనిపించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో చాలానే అవకాశాలు వచ్చాయి. దీంతో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలతో కుర్రకారు మనసు దోచేసుకుంటుంది.

తాజాగా ఈ చిన్నది తన ఇన్ స్టాలో గ్లామరస్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు, చాలా అందంగా, గ్లామర్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.