- Telugu News Photo Gallery Cinema photos Santhosh Shoban's Sridevi Shoban Babu Actress Gouri G Kishan Latest photos telugu cinema news
Gouri G Kishan: అడుగుపెట్టనేలేదు అప్పుడే ఆగమాగం చేస్తోన్న కేరళ కుట్టి.. టాలీవుడ్లోకి మరో అందాల ముద్దుగుమ్మ..
తెలుగు తెరపై కొత్త అందాలు సందడి చేస్తున్నాయి. కన్నడ.. మలయాళం.. తమిళ్ ఇండస్ట్రీల నుంచి టాలీవుడ్లోకి అడుగుపెట్టి సక్సెస్ అవుతున్నారు. కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ సినిమాతో కన్నడ సోయగం ఆషికా రంగనాథ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే మరో కేరళ అందం కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది.
Updated on: Feb 08, 2023 | 9:16 PM

తెలుగు తెరపై కొత్త అందాలు సందడి చేస్తున్నాయి. కన్నడ.. మలయాళం.. తమిళ్ ఇండస్ట్రీల నుంచి టాలీవుడ్లోకి అడుగుపెట్టి సక్సెస్ అవుతున్నారు. కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ సినిమాతో కన్నడ సోయగం ఆషికా రంగనాథ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే మరో కేరళ అందం కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఇప్పటివరకు ఈ అమ్మడు తెలుగులో ఏ సినిమా చేయలేదు. తొలిసారిగా యంగ్ హీరోతో వెండితెరపై సందడి చేయబోతుంది. ముఖ్యంగా కేరళ కుట్టీలు సందడి చేస్తున్నారు. అందులో గౌరీ కిషన్ ఒకరు.

జాను సినిమాలో మెరిసిన ఈ చిన్నది.. ఇప్పుడు శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది. ఇందులో యంగ్ హీరో సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.

ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది గౌరీ కిషన్. ఈ చిత్రానికి చిరంజీవి పెద్ద కూతురు.. అల్లుడు ఏర్పాటు చేసిన కొత్త బ్యానర్ నిర్మిస్తుంది. ప్రశాంత్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రీదేవి - శోభన్ బాబు విలేజ్ నేపథ్యంలో నడిచే కథ. లవ్ డ్రామా జోనర్లో ఈ కథ నడుస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఈనెల 18న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. గ్లామర్ పరంగా .. నటన పరంగా ఈ సుందరి ఎన్ని మార్కులను సంపాదించుకుంటుందనేది చూడాలి.

అడుగుపెట్టనేలేదు అప్పుడే ఆగమాగం చేస్తోన్న కేరళ కుట్టి.. టాలీవుడ్లోకి మరో అందాల ముద్దుగుమ్మ..

అడుగుపెట్టనేలేదు అప్పుడే ఆగమాగం చేస్తోన్న కేరళ కుట్టి.. టాలీవుడ్లోకి మరో అందాల ముద్దుగుమ్మ..

అడుగుపెట్టనేలేదు అప్పుడే ఆగమాగం చేస్తోన్న కేరళ కుట్టి.. టాలీవుడ్లోకి మరో అందాల ముద్దుగుమ్మ..