
చూస్తుండగానే సంక్రాంతి వచ్చి నెల రోజులు కావొస్తుంది.. అప్పుడు వచ్చిన సినిమాల సందడి ఇప్పటికీ కనిపిస్తుంది. ఇక నెల రోజుల కింద థియేటర్లలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడిన ఈ సినిమాలన్నీ.. ఇప్పుడు ఓటిటిలో వార్‌కు సిద్ధమవుతున్నాయి. ఒకేసారి పండగ సినిమాలన్నీ డిజిటల్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. మరి సంక్రాంతి మూవీస్ ఓటిటి డేట్స్‌పై స్పెషల్ స్టోరీ చూద్దామా..

ఏదేమైనా సంక్రాంతి సీజన్ అంటేనే వచ్చే మజా వేరు. అప్పుడు ఉండే సందడి ఏడాదంతా గుర్తుండిపోతుంది. ఈ సారి కూడా ఇదే జరిగింది. పండక్కి గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, నా సామిరంగా వచ్చాయి. తమిళ ఇండస్ట్రీలో అయలాన్, కెప్టెన్ మిల్లర్ లాంటి మూవీస్ వచ్చాయి. ఇప్పుడివన్నీ ఒకే సీజన్‌లో ఓటిటికి వచ్చేస్తున్నాయి.

సంక్రాంతి సినిమాల్లో ఇప్పటికే సైంధవ్ ఓటిటిలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 3నే ఓ ప్రముఖ ఓటిటిలో ఈ సినిమా విడుదల చేసారు మేకర్స్. థియేటర్స్‌లో ఫ్లాప్ అవ్వడంతో.. ఎర్లీ విండో కింద ముందుగానే డిజిటల్‌కు సైంధవ్‌ను ఇచ్చేసారు.

ఇక ఫిబ్రవరి 9న గుంటూరు కారంతో పాటు కెప్టెన్ మిల్లర్, అయలాన్ విడుదలవుతున్నాయి. శివకార్తికేయన్ అయలాన్ అయితే.. తెలుగు థియేటర్స్‌లో రిలీజ్ అవ్వకుండానే ఓటిటికి వచ్చేస్తుంది.

అయలాన్‌ను జనవరి 26న తెలుగులో విడుదల చేయాలనుకున్నా.. అనివార్య కారణాలతో అది కుదర్లేదు. దాంతో నేరుగా డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మరో సంక్రాంతి సినిమా నా సామిరంగా సైతం ఫిబ్రవరి 15న OTT ఎంట్రీ ఇవ్వబోతుంది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం.. నెల రోజులకు ఓటిటిలో వచ్చేస్తుంది. హనుమాన్ మాత్రమే.. మార్చ్ 2వ వారంలో ఓటిటిలోకి రానుందని తెలిపారు దర్శక నిర్మాతలు.