
టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సంయుక్త మీనన్. తెలుగులో ఇప్పటివరకు ఈ బ్యూటీ నటించిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఫస్ట్ మూవీతోనే విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత బింబిసార సినిమాతో మరో హిట్ అందుకుంది. అలాగే తమిళం, తెలుగులో సార్, విరూపాక్ష చిత్రాలతో ఫుల్ ఫాంలో దూసుకుపోయింది ఈ బ్యూటీ.

అయితే వరుసగా హిట్స్ అందుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం సరైన అవకాశాలు రాలేదు. ఇప్పటికీ కేవలం ఒకట్రెండు సినిమాల్లోనే నటిస్తుంది.

తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోను నెట్టింట వైరలవుతున్నాయి. కాటుక కన్నులు, ముక్కుపుడకతో ఎంతో సుమనోహరంగా కనిపిస్తుంది సంయుక్త.