
అంతేకాదు తన జర్నీ గురించి చెప్తూ యంగ్ హీరోయిన్స్ ని ఇన్ స్పైర్ చేస్తున్నారు సమంత. స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫామ్ లో ఉన్న టైంలోనే సడెన్ గా బ్రేక్ తీసుకున్నారు సమంత.

హెల్త్ ఇష్యూ కారణంగా కెరియర్ లో లాంగ్ బ్రేక్ రావడంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యారు. అదే సమయంలో ఓటీటీ ఆఫర్స్ రావడంతో సిల్వర్ స్క్రీన్ కు మరింత గ్యాప్ ఇచ్చారు ఈ బ్యూటీ.

ఓవైపు ఓటీటీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ నిర్మాతగా మారారు సమంత. ముందు తను స్వయంగా నటించే సినిమాతోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని భావించిన ఆ ప్రాజెక్ట్ డిలే కావడంతో శుభం అనే చిన్న సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.

సమంతా సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిన శుభం మే తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చునుంది. సినిమా పండి లాంటి సెన్సేషనల్ మూవీని రూపొందించిన ప్రవీణ్ కంద్రెకుల ఈ సినిమాకు డైరెక్టర్.

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు సామ్. లైఫ్ లో రిస్క్ తీసుకోకపోతే ముందుకు వెళ్ళలేమంటున్నారు సమంత. ఒకప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే భయపడేదాన్ని అన్న సామ్ ఇప్పుడు ఆ భయం లేదన్నారు. రిస్క్ తీసుకోకుండా మార్పు సాధించడం కష్టమన్నది సమంత నేర్చుకున్న కొత్త ఫార్ములా.