
ఒకప్పుడు ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు చేస్తూ వచ్చిన సమంత.. రెండేళ్లుగా అస్సలు తెలుగు ఇండస్ట్రీ వైపు చూడట్లేదు. ఇంకా చెప్పాలంటే ఏ ఇండస్ట్రీలోనూ నటించట్లేదు స్యామ్.

ఒక్క ముక్కలో చెప్పాలంటే నటిగా స్లో అయ్యి.. నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తున్నారు ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే తెలుగులో శుభం సినిమాతో నిర్మాతగా మారారు.

సినిమాల కంటే వెబ్ సిరీస్‌ల వైపు ఎక్కువగా అడుగులేస్తున్నారు సమంత. హిందీలో రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ చేస్తున్నారిప్పుడు. దీని తర్వాత మరో సిరీస్ కూడా లైన్‌లో ఉంది. మరోవైపు నిర్మాతగానూ కథలు వింటున్నారు.

ఈ నేఫథ్యంలోనే తెలుగులో మరో సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మా ఇంటి బంగారం నిర్మిస్తూ.. నటిస్తున్నారు స్యామ్.ప్రొఫెషనల్ లైఫ్ కాసేపు పక్కనబెడితే.. పర్సనల్ లైఫ్‌లోనూ చాలా అప్‌డేట్స్ ఇస్తున్నారు సమంత.

ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో దుబాయ్ ట్రిప్‌లో ఉన్నారు స్యామ్. ఈ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసారు సమంత. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఇటు పర్సనల్.. అటు ప్రొఫెషనల్ లైఫ్ బానే బ్యాలెన్స్ చేస్తున్నారు సమంత.