
అందాల భామ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. హెల్త్ పరంగానే కాకుండా మెంటల్ గానూ సస్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తుంది సామ్.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.

తెలుగులోనే కాదు తమిళ్ ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ. చివరిగా తెలుగులో ఖుషి సినిమాలో మెరిసింది.

సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత సమంత వెకేషన్స్ తో బిజీగా మారిపోయింది. రకరకాల ప్రాంతాలకు వెళ్లి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

అంతే కాదు సామ్‌కు జంతువులంటే చాల ఇష్టం ఇప్పటికే ఈ అమ్మడి దగ్గర రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. మొన్నామధ్య ఓ కోతితో ఫోటో దిగింది.

తాజాగా సమంత గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోల పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.