జాన్‌తో తమన్నా.. సెట్స్‌పైకి వెళ్లనున్న దృశ్యం 3.. ఆసక్తికర సినీ విశేషాలు మీకోసమే..

| Edited By: Phani CH

Jul 15, 2023 | 6:55 PM

నాయకుడు తన చివరి సినిమా అని అన్నారు హీరో ఉదయనిధి స్టాలిన్‌. సామాజిక న్యాయం గురించి నాయకుడులో చర్చించామని అన్నారు. పొలిటికల్‌ డ్రామాగా సాగినప్పటికీ, మంచి ఎమోషనల్‌ డ్రైవ్‌ ఉన్న సబ్జెక్ట్ అని, సరికొత్త బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కిందని అన్నారు ఉదయనిధి.

1 / 5
ఉదయనిధి క్లారిటీ: నాయకుడు తన చివరి సినిమా అని అన్నారు హీరో ఉదయనిధి స్టాలిన్‌. సామాజిక న్యాయం గురించి నాయకుడులో చర్చించామని అన్నారు. పొలిటికల్‌ డ్రామాగా సాగినప్పటికీ, మంచి ఎమోషనల్‌ డ్రైవ్‌ ఉన్న సబ్జెక్ట్ అని, సరికొత్త బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కిందని అన్నారు ఉదయనిధి. యూనివర్శల్‌ అప్పీల్‌ ఉన్న ఈ కథ తప్పకుండా తెలుగువారికి నచ్చుతుందని చెప్పారు.

2 / 5
రోషన్‌ రెడీ: నిర్మలా కాన్వెంట్‌, పెళ్లి సందడి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు హీరో రోషన్‌ మేకా. ఇప్పుడు ప్యాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మోహన్‌లాల్‌ కొడుకుగా వృషభ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారు రోషన్‌.  వైజయంతీ మూవీస్‌, స్వప్నా సినిమా పతాకంపై చాంపియన్‌ తెరకెక్కుతోంది. ఇది కూడా ప్యాన్‌ ఇండియా చిత్రమే.

3 / 5
జీతు-లాల్‌ నయా మూవీ: సక్సెస్‌ఫుల్‌ డైరక్టర్‌తో మళ్లీ పనిచేస్తున్నారు మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌. జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో ఇంకో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్‌లో దృశ్యం, దృశ్యం2 వచ్చాయి. త్వరలోనే దృశ్యం3 సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆల్రెడీ రామ్‌ పార్ట్ ఒన్‌ సెట్స్ మీదే ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత మరో సినిమా చేయడానికి అగ్రిమెంట్‌ చేసుకున్నారట జీతు, మోహన్‌లాల్‌.

4 / 5
జాన్‌తో తమన్నా: తమన్నా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఉత్తరాదిన రీసెంట్‌గా ఓ సినిమాకు ఓకే చెప్పారు. జాన్‌ అబ్రహమ్‌ పక్కన వేదా మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. జాన్‌తో తాను మొదటిసారి పనిచేస్తున్నానని అన్నారు తమన్నా. ఈ మూవీ సెట్స్ కి వెళ్లడం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతోంది వేద.

5 / 5
మర్చిపోలేను: తన కెరీర్‌లో జులై 13కి చాలా గొప్ప ఇంపార్టెన్స్ ఉందని అన్నారు నటి సమంత. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్  చేశారు. సిటాడెల్‌ షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇంకో రెండు రోజులే ఈ కేరవ్యాన్‌లో నా అనుబంధం అంటూ ఇటీవల పోస్ట్ పెట్టారు. కొన్నాళ్ల పాటు షూటింగులకు దూరంగా ఉండనున్నారు సమంత. ఈ సందర్భంగా ఆమె ఏ పోస్టు పెట్టినా, బ్రేక్‌ తీసుకునే వార్తలతో కనెక్ట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.