Phani CH |
Jul 09, 2022 | 9:25 PM
నార్త్ ఇండస్ట్రీ మీద సీరియస్‌గా కాన్సన్‌ట్రేట్ చేసిన సమంత క్రేజీ లైనప్‌తో ఊరిస్తున్నారు. ఇంకా బాలీవుడ్‌లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వకపోయినా... డిజిటల్ ప్రాజెక్ట్‌తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు సామ్.
అందుకే ఆ ఇమేజ్‌ను కంటిన్యూ చేసేలా ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు ఈ స్టార్ హీరోయిన్.
ది ఫ్యామిలీ మ్యాన్ 2లో చేసిన రాజీ క్యారెక్టర్‌తో నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.
ఈ షోలో సామ్ చేసిన బోల్డ్ సీన్స్ అప్పట్లో నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో ఈ భామ బాలీవుడ్ ఎంట్రీ గురించి చర్చ మొదలైంది.
ప్రజెంట్ యశోద, శాకుంతలం లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సమంత నెక్ట్స్ టార్గెట్ బాలీవుడ్ అని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆల్రెడీ నార్త్ మేకర్స్‌తో డిస్కషన్స్ మొదలు పెట్టారు.
తాప్సీ నిర్మాణంలో సమంత సినిమా అన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాకు జోడిగా నటించబోతున్నారట సామ్.
ఆయుష్మాన్ సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ లేకపోయినా... ఆ తరువాత చేయబోయే సినిమా గురించి కూడా డిస్కషన్ మొదలైపోయింది. బాలీవుడ్‌లో రెండో ప్రయత్నంగా మరో టాలెంటెడ్ హీరో విక్కీ కౌషల్‌తో జోడి కట్టేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది నయా అప్‌డేట్.
ఇలా బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ స్టార్స్‌తో జోడి కడుతూ తాను బెస్ట్ యాక్ట్రస్‌గా ప్రూవ్ చేసుకునే ప్లాన్‌లో ఉన్నారట సామ్.