
జవాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయారు తమిళ దర్శకుడు అట్లీ. ఆ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో అట్లీ నెక్ట్స్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఆ అంచనాలు అందుకునే రేంజ్ మూవీని సిద్ధం చేసేందుకు కష్టపడుతున్నారు అట్లీ.

జవాన్ సినిమా రిలీజ్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న అట్లీ, మరో కమర్షియల్ కథను సిద్ధం చేశారు. ఇద్దరు లెజెండరీ స్టార్స్‌తో బిగ్ బడ్జెట్తో మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

బాలీవుడ్ కమర్షియల్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్నారు అట్లీ. అట్లీ, సల్మాన్ మూవీలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీ స్టోరీకి సంబంధించిన అప్‌డేట్స్ ఇప్పుడు సౌత్ నార్త్ సర్కిల్స్‌లో హల్ చల్ చేస్తున్నాయి. రెండు టైమ్ పీరియడ్స్‌కు సంబంధించిన కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ మోడ్రన్ లుక్‌తో పాటు యుద్ధ వీరుడిగా కూడా కనిపించబోతున్నారట.

అయితే ఈ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి ఇంత వరకు అఫీషియల్‌గా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు అట్లీ. ప్రస్తుతానికి తన బ్యానర్‌లో నిర్మిస్తున్న బేబీ జాన్ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ క్రేజీ డైరెక్టర్. ఆ వర్క్ ఫినిష్ అయిన తరువాతే కొత్త సినిమాను పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది.