
నా రూట్ సెపరేటు అని అనుకుంటే ఏ గొడవా లేదు. అలా కాకుండా ఇంకొకళ్లు నడిచిన రూట్లో, సక్సెస్ అయిన దారిలో అడుగులు వేస్తున్నప్పుడు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ వాళ్లు సాధించారు.. ఇప్పుడు వీళ్లేం చేస్తారో అని జనాలు కాన్‌సెన్‌ట్రేషన్‌తో చూస్తున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో.. మురుగదాస్‌ని చూడండి.. ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

నేను నార్త్ కి వెళ్తే ఒక్కడినే వెళ్లను. నాతో పాటు టెక్నికల్ టీమ్‌ని కూడా అక్కడ పరిచయం చేస్తానూ అంటూ, మనసులో మాటను జవాన్ వేదిక మీద చెప్పేశారు కెప్టెన్ అట్లీ. అన్నట్టుగానే చేసి చూపించారు.

జవాన్‌తో ట్రెమండస్ హిట్ కొట్టి చూపించారు. నార్త్ హీరోతో సౌత్ డైరక్టర్ సినిమా చేస్తే, సక్సెస్ గ్యారంటీ అని మరోసారి ప్రూవ్ చేశారు సందీప్ రెడ్డి వంగా. యానిమల్ సినిమాతో ఉత్తరాది వారి చూపులను తనవైపు తిప్పుకున్నారు ఈ డైరక్టర్.

లాస్ట్ ఇయరే కాదు.. కోవిడ్ టైమ్‌లోనూ, అంతకు ముందు కూడా క్రాసోవర్ కాంబినేషన్లు క్లిక్ అయ్యారు. కంగనతో క్రిష్ చేసిన మణికర్ణిక హిట్. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీతో విష్ణువర్ధన్ చేసిన షేర్‌షా సూపర్‌డూపర్ అప్లాజ్ తెచ్చుకున్న సినిమా.

ఇప్పుడు నార్త్ లో సల్మాన్‌తో సికిందర్ అని సినిమా చేస్తున్నారు మురుగదాస్. ఇది కిక్2కి రీమేక్ కాదని, ఒరిజినల్ స్టోరీ అని ఆల్రెడీ చెప్పేశారు ప్రొడ్యూసర్ సాజిద్ నదియడ్‌వాలా. ఆల్రెడీ గజనీతో, అక్షయ్ మూవీ హాలీడేతో నార్త్ లో ప్రూవ్ చేసుకున్నారు మురుగదాస్. తన రికార్డును, సౌత్ కెప్టెన్ల సక్సెస్ రికార్డును... ఇప్పుడు కంటిన్యూ చేయాల్సిన సిట్చువేషన్‌లో ఉన్నారు ఈ కెప్టెన్.