
భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ టైగర్ 3 ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. టైగర్ సిరీస్ మీద ఉన్న నమ్మకం, పఠాన్ గెస్ట్ అపియరెన్స్ కూడా ఈ సినిమాను ఫెయిల్యూర్ నుంచి కాపాడలేకపోయాయి.

ఈ విషయాన్ని ఆయన ఓపెన్‌గా చెప్పకపోయినా, ఆయన వేస్తున్న అడుగులను బట్టి అర్థం చేసుకుంటున్నారు అభిమానులు.. ఇంతకీ అంతలా సల్మాన్ ఏం చేశారంటారా.?

ఏదో ఒక రకంగా సౌత్ ఫ్లేవర్ లేకపోతే.. ఏదో ఇన్‌కంప్లీట్‌గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు సల్మాన్.

అటు మురుగదాస్‌కీ, తనకూ బ్లాక్ బస్టర్ ఖాయమని నమ్ముతున్నారు భాయీజాన్. సికిందర్ సెట్స్ మీద ఉండగానే జవాన్ సినిమా కెప్టెన్ అట్లీతోనూ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఇప్పుడు ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి సికందర్. మురుగదాస్ డైరక్షన్‌లో చేస్తున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో నాయికగా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది.