
ఇప్పుడంటే సల్మాన్ ఖాన్ ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒకప్పుడు ఆయన సినిమా వస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోయేది. ఆయన ఇమేజ్ పీక్స్‌లో ఉన్నపుడు వచ్చిన సినిమానే భజరంగి భాయిజాన్.

బాహుబలి విడుదలైన వారంలోపే ఈ సినిమా కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలకు కథ రాసింది విజయేంద్ర ప్రసాదే. పైగా ఈ రెండూ చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించాయి.

2015, జూలై 10న బాహుబలి వస్తే.. 17న విడుదలైంది భజరంగీ భాయీజాన్. బాలీవుడ్‌లో 500 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి సినిమా ఇదే. అప్పటి వరకు పూర్తిగా యాక్షన్ మాస్ సినిమాలు చేస్తున్న సల్మాన్.. చాన్నాళ్ళ తర్వాత చేసిన పూర్తి ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ఇది.

పసివాడి ప్రాణం లైన్‌తో విజయేంద్రప్రసాద్ ఈ కథ రాసారు.. దీనికి ఇండో పాక్ టచ్ ఇచ్చారు. భజరంగీ భాయీజాన్ సీక్వెల్ కోసం లైన్ సిద్ధం చేసారు విజయేంద్ర ప్రసాద్. దర్శకుడు కబీర్ ఖాన్ కూడా ‘భజరంగి భాయిజాన్’ ఈ సీక్వెల్‌పై ఓపెన్ అయ్యారు.

కచ్చితంగా తీస్తామని.. కాకపోతే సీక్వెల్ క్రేజ్ యూజ్ చేస్కోడానికి కాకుండా.. మంచి కథ కావాలంటున్నారు. అది దొరికిన రోజు భజరంగీ సీక్వెల్ చేస్తామన్నారు కబీర్. ఈ లెక్కన ఉంటుంది కానీ ఇప్పట్లో ఉండదని అర్థమవుతుంది.