డార్లింగ్ ప్రభాస్ చాలా రోజులు తరవాత ఫుల్ మాస్ యాక్షన్ క్యారెక్టర్‌లో నటించిన సినిమా సలార్. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన సినిమా కావటంతో సలార్ మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా మీద అంచనాలను కంట్రోల్ చేసేందుకు మూవీ టీమ్ ఎంత తక్కువ ప్రమోషన్స్ చేసినా...ఆయడిన్స్ మాత్రం సలార్ మేనియాతో ఊగిపోతున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ఒక్కో అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది చిత్రయూనిట్. ఫస్ట్ సింగిల్, రిలీజ్ ట్రైలర్‌తో అంచనాలను పీక్స్‌కు చేరాయి. ఆ ఎఫెక్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ మీద కనిపించింది. ముహూర్తం పెట్టి మరి బుకింగ్స్ ఓపెన్ చేసింది చిత్రయూనిట్. కానీ ఒక్కసారిగా అభిమానులు బుకింగ్స్ కోసం సైట్ ఓపెన్ చేయటంతో బుక్ మై షో సర్వర్ క్రాష్ అయ్యింది.
కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్‌లో కౌంటర్‌లోనూ టికెట్స్ ఇచ్చేందుకు చేసిన ఏర్పాట్లు ఏ మాత్రం సరిపోవటం లేదు. ప్రతీ థియేటర్ ముందూ కిలో మీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.
బుక్ మై షోలో పబ్లిక్ ఇంట్రస్ట్ విషయంలోనూ ఆల్ టైమ్ రికార్డ్ దిశగా దూసుకుపోతోంది సలార్. ఈ సినిమాకు పోటిగా రిలీజ్ అవుతున్న డంకీకి మూడున్నర లక్షల లైక్స్ రాగా, సలార్‌కు 16 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది సలార్. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బెనిఫిట్ షోస్‌కు పర్మిషన్ ఇవ్వటంతో ఉదయం నాలుగు గంటలకు స్పెషల్ షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. ఇప్పటికే అంచనాలు భారీగా ఉండటంతో డే వన్ అన్ని రికార్డులను సలార్ చెరిపేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. మరి డార్లింగ్ ఈ అంచనాలను అందుకుంటారేమో చూడాలి.