- Telugu News Photo Gallery Cinema photos Sairat Fame Rinku Rajguru Shares Beautiful photos goes viral telugu movie news
Rinku Rajguru: పాల కడలిపై వెన్నెలమ్మ.. స్టన్నింగ్ స్టిల్స్‌తో మాయ చేస్తోన్న రింకు..
తొలి చిత్రానికే కుర్రాళ్ల హృదయాలకు గాయం చేసిన హీరోయిన్ రింకు రాజ్ గురు. అందం, అభినయంతో సినీ క్రిటిక్స్ ను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న రింకు.. ఇప్పటికీ కుర్రాళ్ల ఆరాధ్య దేవత. 2016లో సైరత్ సినిమాతో మరాఠీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. అప్పట్లో ఈ ప్రేమకథ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
Updated on: May 07, 2024 | 9:28 PM

తొలి చిత్రానికే కుర్రాళ్ల హృదయాలకు గాయం చేసిన హీరోయిన్ రింకు రాజ్ గురు. అందం, అభినయంతో సినీ క్రిటిక్స్ ను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న రింకు.. ఇప్పటికీ కుర్రాళ్ల ఆరాధ్య దేవత.

2016లో సైరత్ సినిమాతో మరాఠీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. అప్పట్లో ఈ ప్రేమకథ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి హిందీలో దఢక్ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్, ఇషాన్ కత్తర్ హీరోహీరోయిన్లుగా నటించారు.

కానీ సైరత్ అంతగా దఢక్ చిత్రం హిట్ కాలేకపోయింది. సైరత్ సినిమా హీరోయిన్ అర్చీ పాత్రలో మెస్మరైజ్ చేసింది రింకు. ఈ మూవీతో అప్పట్లో కుర్రాళ్లకు ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత మరాఠీలో పలు చిత్రాల్లో నటిస్తు గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రింకు.. నిత్యం ఏదోక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. పూర్తిగా తెల్లటి గౌనులో ప్రిన్సెస్ లుక్ లో కనిపిస్తూ క్రేజీ స్టిల్స్ తో కట్టిపడేసింది.

పాల కడలిలోని వెండి వెన్మెలమ్మ మాదిరిగా కనిపిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది రింకు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే..రింకు ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.




