Sai Pallavi: అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్న సాయి పల్లవి
అటు నువ్వే.. ఇటు నువ్వే.. అనే పాట గుర్తుంది కదా..! సాయి పల్లవిని చూస్తుంటే ఈ పాటే గుర్తుకొస్తుందిప్పుడు. ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ భామే కనిపిస్తున్నారు. ముంబైలోనే ఉంటూ.. సౌత్ సినిమాలను కూడా సెట్ చేస్తున్నారు సాయి పల్లవి. అసలిన్ని ఇండస్ట్రీలను ఈ బ్యూటీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు..? ఆ మధ్య ఏడాది పాటు సినిమాలే చేయలేదు సాయి పల్లవి. దాంతో ఎందుకు ఈ గ్యాప్ అనుకున్నారు ఆమె ఫ్యాన్స్.