- Telugu News Photo Gallery Cinema photos Bollywood heroins Janhvi Kapoor Shraddha Kapoor Deepika Padukone those who can't dub in Telugu
వరుసగా సినిమాలు క్యూ లో ఉన్న.. తెలుగులో డబ్బింగ్ చెప్పుకోలేకున్న ముద్దుగుమ్మలు
సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకోవాలంటే... సమ్‌థింగ్ స్పెషల్‌గానే ఏదో ఒకటి చేయాలి కదా... అలా కాకుండా నలుగురూ నడిచిన దారిలోనే నడుస్తానంటే ఏం బావుంటుంది? ఈ విషయాన్ని ఇప్పుడు జాన్వీ కపూర్‌కి ఎవరైనా చెప్పాలి... ఫస్ట్ సినిమా విడుదల కాకముందే, ఒకటీ రెండూ, మూడూ అంటూ మల్టిపుల్ ప్రాజెక్టులకు సంతకాలు చేసిన ఈ బ్యూటీ అర్జంటుగా నేర్చుకోవాల్సింది ఏంటి?
Updated on: Aug 11, 2024 | 11:14 AM

సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకోవాలంటే... సమ్‌థింగ్ స్పెషల్‌గానే ఏదో ఒకటి చేయాలి కదా... అలా కాకుండా నలుగురూ నడిచిన దారిలోనే నడుస్తానంటే ఏం బావుంటుంది? ఈ విషయాన్ని ఇప్పుడు జాన్వీ కపూర్‌కి ఎవరైనా చెప్పాలి... ఫస్ట్ సినిమా విడుదల కాకముందే, ఒకటీ రెండూ, మూడూ అంటూ మల్టిపుల్ ప్రాజెక్టులకు సంతకాలు చేసిన ఈ బ్యూటీ అర్జంటుగా నేర్చుకోవాల్సింది ఏంటి?

ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఆలియా తెలుగు నేర్చుకున్నారు. తెలుగు ట్యూటర్‌ని పెట్టుకుని కూడా ప్రాక్టీస్ చేశారు. అయినా ఎక్కడో ఆమె మాటలు.. ఎమోషన్స్ ని పండించకపోవడంతో వాయిస్ రీప్లేస్ జరిగింది... ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్లు జరిగినన్ని రోజులూ జనాల్లో నానిన వార్త ఇది. కల్కి కోసం దీపికే డబ్బింగ్ చెప్పుకున్నారా? అన్నది ఈ మధ్య వైరల్ అయిన మరో టాపిక్.

కల్కి కోసం దీపిక డబ్బింగ్ చెప్పుకోలేదు. ఆ మాటకొస్తే ఆ సినిమాలో చేసిన దిశా పాట్నిది కూడా సొంత వాయిస్ కాదు. వాళ్లకు తెలుగు రాదు కాబట్టి, మరొకరి డబ్బింగ్ మీద బేస్ అయ్యారు. సాహో టైమ్‌లో శ్రద్ధా కపూర్ కూడా సొంత డబ్బింగ్ చెప్పుకోలేదు.

తెలుగులో ఏ టాప్ సినిమా షురూ అవుతుందనే వార్త వినిపించినా, నాయికగా కియారా పేరు తప్పక ట్రెండ్ అవుతుంది. అంత చరిష్మా ఉన్నప్పటికీ కియారా ఇంకా తెలుగు నేర్చుకోలేదు. మరి గేమ్ చేంజర్‌లో అయినా సొంత డబ్బింగ్ చెప్పుకుంటారా? అని ఎదురుచూస్తున్నవారూ లేకపోలేదు.

కియారా విషయంలో వినిపిస్తున్న మాటలే జాన్వీ విషయంలోనూ ట్రెండ్ అవుతున్నాయి. దేవర రెండు పార్టులతో పాటు, చరణ్ సినిమా చేస్తున్నారు కియారా. ఆమె ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదేమో.. మరి తెలుగులో మాట్లాడాలని జాన్వీకీ ఉందా? లేకుంటే డబ్బింగ్ మీదే బేస్ అవుదామని అనుకుంటున్నారా? లెట్స్ వెయిట్ అండ్ సీ...