
కొందరి మధ్య పోలిక చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి వారిలో సాయిపల్లవి అండ్ రష్మిక మందన్న ఉంటారు. ఇద్దరూ డ్యాన్సులు బాగా చేసినా, పెర్ఫార్మెన్సులు చక్కగా చేసినా జనాలు వాళ్లను తక్కువగా పోలుస్తుంటారు. కానీ ఇప్పుడు ఒక్క విషయం ఇద్దరిలో కామన్‌గా కనిపిస్తోంది.

రష్మిక మళ్లీ శక్తి పుంజుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన సికిందర్ ఫ్లాప్ కావడంతో, మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో షూటింగుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు.

ఆమె నటిస్తున్న థామా షూటింగ్ ఊటీ పరిసరాల్లో జరుగుతోంది. మరికొన్నాళ్లు అక్కడే ఉంటానంటూ పోస్టు పెట్టారు రష్మిక. రష్మిక మాత్రమే కాదు, సాయిపల్లవి కూడా చెట్ల మధ్యనే గడుపుతున్నారు.

ఆమె జానకీదేవి గా నార్త్ లో రామాయణం తెరకెక్కుతోంది. లంకలో సీతాదేవి ఉన్న పోర్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సాయిపల్లవి కూడా ఎక్కువ భాగం పారెస్ట్ సెట్లోనే షూట్ చేస్తున్నారు.

నార్త్ రామాయణం రెండు భాగాలుగా విడుదల కానుంది. అయినా, సాయిపల్లవికి అడవుల్లో షూటింగ్ చేయడం కొత్తేమీ కాదు. విరాటపర్వం షూటింగ్ సమయంలోనే ఆమెకు ఫారెస్ట్ లో షూట్ ఎక్స్ పీరియన్స్ ఉంది. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్.