
యాక్టింగ్ తోపాటు నెమలిలా నాట్యం చేయడం సాయి పల్లవికి మాత్రమే చెల్లుతుంది. ఆమె ముందు హీరోలు కూడా తక్కువైపోతుంటారు.

సాయిపల్లవికి తెలుగులో అభిమానులు చాలానే ఉన్నారు. సినిమాల్లోని ప్రదర్శన ద్వారానే కాకుండా ఆమె యాటిట్యూడ్, ప్రవర్తన, మాట తీరుకు అభిమానులున్నారు.

ప్రస్తుతం సాయి పల్లవి.. నాచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగరాయ్ మూవీ.. అటు రానాతో విరాట పర్వం మూవీ చేస్తుంది.

తాజాగా బాలీవుడ్ నుంచి కబురు వచ్చినట్లు తెలుస్తుంది. ఓ ప్రముఖ బ్యానర్ లో రానున్న మూవీలో నటించాలంటూ ఆమెకు ఆఫర్ వచ్చినట్లుగా టాక్.

ఇందుకు సాయిపల్లవి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. నాగచైతన్య సరసన నటించిన లవ్ స్టోరీ సినిమాకు రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

సాయి పల్లవి..