లవ్ స్టోరీ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం తండేల్. కార్తికేయ 2 తో పాన్ ఇండయా హిట్‌ను అందుకున్న చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించాడు.
మత్స్యకారుల జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాసు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు
ఇప్పటికే తండేల్ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఇదే మూవీ నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్
నాగ చైతన్య రగ్గ్‌డ్ లుక్‌లో కొత్తగా కనిపించాడు. అయితే గ్లింప్స్ మొత్తానికి హైలెట్ అంటే సాయి పల్లవినే. గ్లింప్స్‌లో కనిపించింది కొద్ది సేపైనా ఆమె నవ్వు, స్క్రీన్ ప్రెజన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్.
తండేల్ మూవీలో సాయి పల్లవి లుక్ పై ఫ్యాన్స్ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత దేవత దర్శనం అయిందని, 'ఏం స్మైల్ రా బాబు.. మైండ్లో నుంచి పోవడం లేదు' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.