Rukmini Vasanth: సాయిపల్లవి, రష్మిక, కీర్తిసురేష్.. ఇప్పుడు “రుక్మిణీ వసంత్”..?
సినీ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీల హవా నడుస్తోంది. సాయి పల్లవితో మొదలైన ఈ ట్రెండ్ రోజు రోజుకీ ఊపందుకుంటోంది. రష్మిక మందన్నా, కీర్తి సురేశ్ వంటి స్టార్ హీరోయిన్లు సైతం డీ గ్లామర్ రోల్స్‌తో మెప్పిస్తున్నారు. లేటెస్ట్ గా అదే బాటలో మరో యంగ్ బ్యూటీ వచ్చేస్తోంది. ఇటీవల కన్నడలో సూపర్ హిట్ కొట్టిన సప్త సాగర దాచే ఎల్లో అనే సినిమాను తెలుగులో సప్త సాగరాలు దాటి పేరుతో విడుదలైంది. ఇందులో రక్షిత్ శెట్టికి జోడీగా రుక్మిణీ వసంత్ అనే బెంగళూరు బ్యూటీ నటించి..ఆకట్టుకుంది.